మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి. ఎలాగో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. కింద చూడండి.

మీరే సొంతగా డ్రైవింగ్ లైసెన్స్ స్లాట్ బుక్ చేస్కోండి

ఎలాగో నేను చెప్తాను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్.. కింద చూడండి.


కంప్యూటర్ లో Google Chrome ఓపెన్ చెయ్యండి. హోమ్ పేజీ వస్తుంది అందులో "transport.telangana.gov.in" అని టైపు చేసి ఎంటర్ కొట్టండి. అప్పుడు official website  ఓపెన్ అవుతది. కింది విదంగా.




అందులో కుడి వైపు "FOR ONLINE SERVICES AND PAYMENTS CLICK HERE" అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చెయ్యండి. అప్పుడు కింది పేజీ ఓపెన్ అవుతుంది.


అందులో మొదటి ఆప్షన్ " New Learner Licence " అనే ఆప్షన్ ని క్లిక్ చెయ్యండి నెక్స్ట్ పేజీ ఇలా వస్తుంది.

అందులో కోవిద్-19 రూల్స్ ని continue చేసి agree మీద క్లిక్ చెయ్యండి. అప్పుడు రెజిస్ట్రేషన్ పేజీ ఓపెన్ అవుతుంది ఇలా.




అందులో మీ district test ఎక్కడ రాస్తారో టెస్ట్ సెంటర్ సెలెక్ట్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ టైపు చెయ్యగానే మీకు ఒక otp వస్తది. దానిని అక్కడ టైపు చేసి captcha  ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టండి


అప్పుడు ఒక పేజీ ఓపెన్ అవుతుంది అందులో డేట్ అండ్ టైం సెట్ చేసుకోవాలి మనం ఎప్పుడు టెస్ట్ కి వెళ్ళాలి అనుకుంటున్నామో డేట్ అన్నమాట. అక్కడ డేట్స్ రెడ్ కలర్ లో ఉంటె ఆల్రెడీ బుక్ అన్నమాట గ్రీన్ కలర్ లో ఉంటేనే ఓపెన్ ఉన్నట్టు అది చూసుకొని ఒక డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. పక్కన available  టైం వస్తది అందులో టైం సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ కొట్టాలి. మొత్తం కింద ఉంది చుడండి.


తరువాత అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతది అందులో మీ డీటెయిల్స్ అడ్రస్ అన్ని కరెక్ట్ గా ఫిల్ చెయ్యండి. అవే మీ కార్డు పైన వస్తాయి. మీ ఆధార్ లో ఉన్న డీటెయిల్స్ ఎంటర్ చెయ్యండి కరెక్ట్ ఉంటాయి. కింద ఇమేజ్ చుడండి క్లియర్ అర్ధం అవుతది.



అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసారా కింద లైసెన్స్ కేటగిరీ మరియు లైసెన్స్ క్లాస్ టైపు అని ఉంటది. అవి సెలెక్ట్ చేసుకోండి. సబ్మిట్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజీ కి వెల్తది ఇలా.

మీ స్లాట్ డీటెయిల్స్ పేమెంట్ ఎంత అనేడి చూపిస్తది. తరువాత "PAY NOW FOR CONFERMATION OF SLOT" అని కనిపిస్తాడు దానిపైన క్లిక్ చెయ్యగానే పేమెంట్ మెథడ్ కి వెల్తది. అక్కడ మన పేమెంట్ మెథడ్ "BANKS" అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని " MAKE PAYMENT" మీద క్లిక్ చెయ్యండి. పేమెంట్ మోడ్ కి వెల్తది.


 


కింద క్లియర్ IMAGES ఉన్నాయ్ చుడండి.





ఇక్కడ పేమెంట్ కార్డు తో చేస్తారో సెలెక్ట్ చేసుకొని పేమెంట్ చెయ్యండి. తెలుసుకదా మీకు ఒక ఓటీపీ వస్తది అది కొట్టక పేమెంట్ అవుతది. తరువాత మీకు ఒక ఫారం కాన్ఫర్మషన్ ఫారం గెనెరతె అవుతాది అది ప్రింట్ తీస్కొని, దానితో పాటు మీ ID  కార్డు ఎదైనా తీస్కొని మీరు బుక్ చేసుకున్న RTA CENTER కి వెళ్ళండి. అక్కడ మీకు ఒక EXAM పెడతారు అందులో జెనెరేల్ ట్రాఫిక్ రూల్ గురించి 20 ప్రశ్నలు ఉంటాయి. అందులో మీరు 12 కరెక్ట్ పెడితే చాలు మీకు LEARNING LICENCE ఇస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి అది మీకు 6 నెలలు మాత్రమే పని చేస్తది. లోపు మీరు డ్రైవింగ్ టెస్ట్ కి మల్లి స్లాట్ బుక్ చేసుకోవాలి. అది కూడా ఇదే విదంగా బుక్ చేసుకోవాలి. 6 నెలలు దాటితే మల్లి లెర్నింగ్ తియ్యాలి. కాబట్టి జాగ్రత్త. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా బుక్ చేస్కోండి. ఉంటాను మరి.

                        మీ శ్రేయోభిలాషి

 

Comments

Popular posts from this blog

చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?

గరుడ పక్షి లాగా ఆలోచించగలరా?