గరుడ పక్షి లాగా ఆలోచించగలరా?
గరుడ పక్షి లాగా ఆలోచించగలరా? గరుడ పక్షిలా ఆలోచించండి సక్సెస్ మీ వెంటే ఉంటది. ఎలా అంటారా.. ? మనం ఎప్పుడు మన జీవితంలో జరిగిన పాట ఫెయిల్యూర్ ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాం. మన గురించి మన చుట్టూ ఉన్నవాళ్ళు, బయటివాళ్ళు ఏమనుకుంటున్నారో అదే నిజం అనుకుంటాం. కానీ అదంతా నిజం కాదు. మనం ఎప్పుడైతే సరైన నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మన జీవితం మారుతుంది. లేదు బయ్యా అదేం వర్కవుట్ కాదు అంటారా? అయితే ఈ రోజు మీకు ఆకాశాన్ని హక్కుగా భావించే "గరుడ పక్షి " గురించి చెప్పాల్సిందే... ఇంకెందుకు ఆలస్యం చదివేద్దాం పదండి. మనం అప్పుడప్పుడు కొంతమంది గొప్పవాళ్లు చెప్పే మాట ఒకటి గుర్తు చేసుకుందాం. అదేంటంటే " ఎగిరితే గరుడ పక్షిలా ఎగరాలి" అని కదా? ఎందుకంటె గరుడ అంటేనే బలం, దైర్యం మరియు ఆధిపత్యం. అందుకనే ప్రపంచంలో దీనికి అభిమానులు ఎక్కువ, ఎన్నో దేశాలు వాళ్ళ జండాలు పైన ముద్రించుకొనే వాళ్ళ దేశానికి సింబల్ గా పెట్టుకున్నారు, ఇంకా చాల మంది గరుడని పచ్చబొట్టు(TATOO) పొడిపించుకుంటారు. గరుడ పక్షి ఆకాశాన్ని హద్దులాగా భావించదు, హక్కుగా భావిస్తది, అందుకే మేఘం తగిలిన ప్రతిసారి ఇంకా పైకెగురుతుంది కానీ కిందకి ర...