గరుడ పక్షి లాగా ఆలోచించగలరా?
గరుడ పక్షి లాగా ఆలోచించగలరా?
గరుడ పక్షిలా ఆలోచించండి సక్సెస్ మీ వెంటే ఉంటది. ఎలా అంటారా.. ?
మనం ఎప్పుడు మన జీవితంలో జరిగిన పాట ఫెయిల్యూర్ ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాం. మన గురించి మన చుట్టూ ఉన్నవాళ్ళు, బయటివాళ్ళు ఏమనుకుంటున్నారో అదే నిజం అనుకుంటాం. కానీ అదంతా నిజం కాదు. మనం ఎప్పుడైతే సరైన నిర్ణయం తీసుకుంటామో అప్పుడు మన జీవితం మారుతుంది. లేదు బయ్యా అదేం వర్కవుట్ కాదు అంటారా? అయితే ఈ రోజు మీకు ఆకాశాన్ని హక్కుగా భావించే "గరుడ పక్షి " గురించి చెప్పాల్సిందే... ఇంకెందుకు ఆలస్యం చదివేద్దాం పదండి.
మనం అప్పుడప్పుడు కొంతమంది గొప్పవాళ్లు చెప్పే మాట ఒకటి గుర్తు చేసుకుందాం. అదేంటంటే " ఎగిరితే గరుడ పక్షిలా ఎగరాలి" అని కదా? ఎందుకంటె గరుడ అంటేనే బలం, దైర్యం మరియు ఆధిపత్యం. అందుకనే ప్రపంచంలో దీనికి అభిమానులు ఎక్కువ, ఎన్నో దేశాలు వాళ్ళ జండాలు పైన ముద్రించుకొనే వాళ్ళ దేశానికి సింబల్ గా పెట్టుకున్నారు, ఇంకా చాల మంది గరుడని పచ్చబొట్టు(TATOO) పొడిపించుకుంటారు.
గరుడ పక్షి ఆకాశాన్ని హద్దులాగా భావించదు, హక్కుగా భావిస్తది, అందుకే మేఘం తగిలిన ప్రతిసారి ఇంకా పైకెగురుతుంది కానీ కిందకి రాదు. గరుడ కి ఓడిపోవడం, ఓటమిని ఒప్పుకోవడం చేతకాదు. అందుకే ఈ రోజు ఈ గరుడ పక్షి నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుందాం.
చూసే వాళ్ళందరూ మన చుట్టూ ఉన్నవాళ్లతోనే మనల్ని పోలుస్తారు. మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో వాళ్ళ స్వభావాన్ని బట్టి మనల్ని అంచనా వేస్తారు. సరే వాళ్ళందరు అంటున్నారు వాళ్ళని వదిలేయ్. ఒకసారి నువ్వే ఆలోచించు, ని చుట్టూ ఉన్న ని ఫ్రెండ్స్ వాళ్ళ నువ్వు ముందుకు వెళ్తున్నావా..? లేక అక్కడే ఆగిపోయావా..?
మిత్రమా నువ్వెప్పుడైనా గమనించావా? గరుడ పక్షి అప్పుడపుడు ఉండడం చూసాం కానీ, గుంపులుగా ఎగరడం మాత్రం చూడలేదు. నేనైతే చూడలేదు నువ్వు చూసావా?
కచ్చితంగా చూసి ఉండవు. ఎందుకంటె అవి ఎప్పుడు ఒంటరిగానే ఎగురుతాయి.
గరుడలాగా మనం లీడర్ అవ్వాలి అంటే మనకు ఈ క్వాలిటీ కచ్చితంగా ఉండాలి. మీరు KGF మూవీ చూసారా అందులో అదే చెప్తది ఎవ్వరిని తోడుగా తీసుకువెళ్లకు నువ్వొక్కడివే పోరడు అని, అలాగన్నమాట. ఎంత కష్టం అయినా ఒంటరిగా ప్రయత్నించాలి, సాధించి చూపించాలి. ఒక్కొక్కసారి మన జీవితం లో చాల కష్టమైన క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది, అప్పుడు వెనకడుగు వెయ్యకు సరైన నిర్ణయం తీస్కొని ముందుకువెళ్ళు, అది ఎంతకష్టమైన ముందున్న విజయాన్ని తలుచుకొని ముందుకు దూకాలి. అప్పుడు ధనమ్మ సక్సెస్ ని ముందట మోకాళ్ళ మీద కూర్చుంటది.
అంట బాగానే ఉంది బయ్యా బాగా చెప్పావ్ కానీ మన చుట్టూ ఉన్నవాడు మంచోడా, చెడ్డోడా అని ఎలా తెలిసేది అంటారా..? చెప్తా చెప్తా..
మనం సీరియస్ గా చదువుతున్నపుడుకానీ, సీరియస్ పనిలో ఉన్నపుడుకానీ, ఏరా ఎప్పుడు ఇదే పనా? పద అలా బయటికి వెళ్లి మందెద్దాం, దమ్మేద్దాం అని చెప్పేవాళ్ళు ఉంటారు వాళ్ళకి యెంత దూరంగా ఉంటె అంత మంచిది. ఒకటి గుర్తుపెట్టుకోండి.. " ని చుట్టూ ఉన్న వాళ్ళు ఐతే ని గెలుపుకి కారణం అవుతారు లేదా ని నాశనానికి కారణం అవుతారు. అందుకే నేనంటాను ఇంకొకసారి చూసుకోండి బయ్యా మీ చుట్టూ ఉన్నది ని గెలుపు కోరుకునే వాళ్ళు మాత్రమే అవ్వాలి. లేదంటే గరుడ పక్షి లాగ ఒంటరిగా ఎగరడం మొదలుపెట్టండి. ఎందుకంటె..
గరుడ ఎప్పుడు భయపడడు అది వేటాడే జీవి ఎంత పెద్దదైన వేటాడితీరుతుంది. అంటే కానీ ఎప్పుడు వేట మనుకోదు. గరుడ కి భయపడడం, ధైర్యాన్ని కోల్పోవడం తెలియదు.
కానీ మనం ఆలా పెరగలేదు కదా అంటారా? అవును కరెక్టే, మన చుట్టూ ఉన్న వాళ్ళ వల్లనో ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్లనో కొత్తగా ఏదైనా చెయ్యాలంటే బయపడతాం. మన చుట్టూ ఉత్సాహపరిచే వాళ్ళ కన్నా అవమానపరిచే వల్లే ఎక్కువ ఉంటారు. వాడా ఇన్ని రోజులు పొడిచాడు ఇక ఇప్పుడు పొడుస్తాడు. అని వాళ్ళ కాదు అని హేళనగా మాట్లాడుతారు. అప్పుడు మనం అస్సలు కొత్త పనుల జోలికి వెళ్ళాం. కానీ మిత్రమా ప్రతిసారి సక్సెస్ కోసమే కాదు. అప్పుడప్పుడు ధైర్యాన్ని పెంచుకోడానికి, కాపాడుకోడానికి పనులు చెయ్యాలి. అస్సలు భయపడడం లోనే పడిపోవడం ఉంది కదా..?
నిర్మాణం నీదే మిత్రమా.... గరుడ లా ఎగురుతవ...? అలాగే మిగిలిపోతావా...?
Comments
Post a Comment