yemi lenivadiki AIM lekapote yem avtundi?

 

ఏమీ లేనివాడికి AIM లేకపోతె ఏమవుతుంది?

           అతను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అబ్బాయి. అతని పేరు "నాని"  నాన్నగారు "రాజన్న" ఒక టైలర్. అమ్మ "లక్ష్మి" వృత్తి పని చేస్తూ ఉంటుంది. "నాని" కి ఇద్దరు చెల్లెళ్ళు. అమ్మ నాన్న ఇద్దరు కష్టపడుతూ కుటుంబాన్ని పోషిస్తు పిల్లలను చదివిస్తున్నారు. "నాని" 10th తరువాత ఇంటర్మీడియేట్ అక్కడే చేసాడు. ఇంటర్మీడియేట్ ఐన తరువాత EAMCET రాసాడు ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాడు. అది normal ఇంజనీరింగ్ కాలేజీ, అందులో చదివి పాస్ అయ్యాడు బయటికొచ్చాడు. నాని తెలుగు మీడియం స్టూడెంట్ కావడం వల్ల అతను బైట జాబ్ లో సెలెక్ట్ అవ్వలేక పోయాడు. నాని వాళ్ళ నాన్న కొన్ని రోజులు బైటి దేశం వెళ్ళాడు, అందువల్ల నాని కి సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేకపోవడం వల్ల నెక్స్ట్ ఏంచెయ్యాలో తెలిసేది కాదు.



                   ఇక్కడి నుండి నాని తప్పులు చెయ్యడం స్టార్ట్ చేసాడు, అతను చేసేది కరెక్ట్ లేక తప్ప అనే విషయం కూడా అతనికి అర్ధం అయ్యేది కాదు. ఎవ్వరు ఏది చెప్తే అది చెయ్యాలి అనుకునేవాడు అతనికి ఒక క్లారిటీ ఉండేది కాదు. కొన్ని రోజులు కోచింగ్ వెళ్ళాడు కానీ అప్పుడు నోటిఫికెషన్స్ లేక అది వదిలేసాడు. మల్లి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారని ఒక కోర్స్ లో జాయిన్ అయ్యాడు. అది పూర్తిగా నేర్చుకోలేదు అతని చదువు కి సంబందించినది కాకపోవడం వలన అది వదిలేసాడు. తరువాత ఒక చిన్న కంపెనీ లో జాయిన్ అయ్యాడు, కానీ అది చిన్న కంపెనీ కావడం వల్ల వాళ్ళు శాలరీ సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. కొంతకాలని పని నాని సొంతగా చెయ్యడం స్టార్ట్ చేసాడు అక్కడ ఉద్యోగం మానేసాడు. కానీ పని ఎక్కువ రోజులు ఉండలేదు. మల్లి మొదటికి వచ్చింది పరిస్థితి, విదంగా 3 సంవత్సరాలు గడిచిపోయింది. మల్లి ఒక కోర్స్ నేర్చుకొని పని చేస్కుంటూ వచ్చాడు, కానీ అది అతనికి సంతృప్తి ఇవ్వలేదు

  ఇవన్నీ జరగడానికి ఇంకొక కారణం కూడా ఉందిఅదే "ప్రేమ" దీనినే వ్యామోహం అనొచ్చు.


  ఇందులో మునిగి పోయి కెర్రిర్ మర్చిపోయాడు. జీవితం మీద సీరియస్నెస్ లేదు అందరు అనేవారు, తెలివైన వాడివే కదా ఉద్యోగం ఎందుకు దొరకటం లేదు అని, కానీ అవేమి పట్టించుకునేవాడు కాదు. ఎందుకంటే అతనికి వాళ్ళ అమ్మ నాన్న కష్టం గుర్తుకురావటం లేదు, ఒకటే ఆలోచన అమ్మాయితో గడపాలి. విధంగా ఏడైన చేసే సత్తా ఉన్నపటికీ ఏం చెయ్యకుండా ఒక గోలే లేకుండా 2 సంవత్సరాలు వృధా చేసాడు. అప్పుడు అతనికి  ఆలోచన వచ్చింది 5 సంవత్సరాలు వృధా చేశా అని.  

అప్పుడు నాని ఎం చేసాడు మారాడా!.... మల్లి ఎం చేసాడు? చూద్దాం.

అప్పుడే SI నోటిఫికేషన్ వచ్చింది, కోచింగ్ లో చేరాడు. ఈసారి బాగానే చదివాడు, ఎక్సమ్ క్వాలిఫై అయ్యాడు, కానీ ఫిసికల్ ఎక్సమ్ పోయింది. దాంతో మల్లి దిగ్బ్రాంతి, ఇది నాకు రాదు అని ఫిక్స్ అయ్యాడు. ఇంకొక ప్రయత్నం చేస్తే వస్తదేమో అన్న ఆలోచన కూడా చెయ్యలేదు. మరి ఏంచేసాడు...

          మల్లి ఒక మిస్టేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. అదేంటంటే నాని ఫ్రెండ్ ఒకతను Dubai లో ఉంటాడు, అతను కాల్ చేసి మామ పొతే పోనీ SI జాబ్ అవి మనకి రావు. ఇక్కడ మీకు మంచి software జాబ్స్ ఉన్నాయి అని చెప్పేసరికి మనోడికి ఆశ పుట్టింది. మరి వెళ్లాలంటే మనీ కావాలి కదా! ఇంట్లో చెప్పగానే కొడుకు ఆలా ఐనా సెట్ అవుతాడని వాళ్ళ నాన్న అప్పు చేసి మనీ ఇచ్చాడు, అవి వాళ్ళ ఫ్రెండ్ చెప్పిన ఒక అన్నకు పంపాడు ఫ్రెండ్ ద్వారా. అంటే ఏజెంట్ కి కట్టాడు. వాడు మోసగాడు అని ఫ్రెండ్కి తెలుసు కానీ వాడు చెప్పలేదు. ఇక్కడికి ఇలాగొలా తీసుకొస్తే వాడే ఎదో ఒకటి చేసుకుంటాడు నాకు మాత్రం కొన్ని మనీ వస్తాయి అని నాని ఫ్రెండ్ ఆలోచించించాడు. విషయం పాపం నాని కి నాని ఫామిలీ కి తెలియదు. నాని కోచింగ్ వెళ్ళాడు ఐపోయింది. మనీ వెళ్లాయి పాసుపోర్టు తీసాడు దానికి 1 సంవత్సరం టైం పట్టింది కొన్ని కారణాల వల్ల. చివరికి పాస్పోర్ట్ వచ్చింది. అన్ని డాకుమెంట్స్ పంపాడు కానీ వీసా రావడం లేదు. ఎప్పుడు అడిగిన వాళ్ళు కారణాలు చెప్పుకుంటూ రోజులు గడిపేస్తున్నారు. అప్పటికి కొంత మంది మంచి ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్తున్నారు వద్దు ఇక్కడే వేరే ఉద్యోగం కోచింగ్ కి సంబందించినది ట్రై చేయి అని, కానీ నాని వినట్లేదు. ఒకటే ఆలోచన అబ్రాడ్ వెళ్ళాలి. 1 సంవత్సరం గడిచింది ఫ్రెండ్ కాల్ చేసాడు, ఏజెంట్ అన్న హాస్పిటల్ లో చావుబతుకుల్లో ఉన్నాడు అని చెప్పాడు. నాని హార్ట్ ఒక్కసారిగా ఫాస్ట్ గా కొట్టుకోవడం స్టార్ట్ అయింది, టెన్షన్ తో నా పరిస్థితి ఏంటి అని అడిగాడు నాని. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ నో ప్రాబ్లెమ్ నీకు వీసా ఓకే ఇది కదా ఇక్కడికి వచ్చాక నేను చూసుకుంటా అన్నాడు. అప్పడికి ఇంటిదగ్గర ఫ్రెండ్స్ వద్దు వేళ్ళకు పొతే పోని కొంచం లాస్ అయ్యాను అనుకో అక్కడికి వెళ్తే ఇంకా ఇబ్బంది పెడ్తవు అన్నారు. కానీ నాని విన్నాడా లేదు. ఒక రోజు ఫ్రెండ్ టికెట్ వేస్తె వెళ్ళిపోయాడు. ఇక్కడ మీకొక డౌట్ రావొచ్చు ఆటను చచ్చిపోయాడు కదా వీసా ఎలా వచ్చింది అని, అది విసిట్ వీసా సింగల్ ఎంట్రీ. దానితో వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాక కంప్లీట్ వర్క్ వీసా వస్తది అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తే వెళ్ళాడు.

              మరి అక్కడ ఏం జరిగింది? నాని జాబ్ లో చేరాడా? చూద్దాం.....

 అలసి పోయారా కొంచం Break తీస్కోండి. మంచినీళ్లు తాగండి.

హా... నాని దుబాయ్ వచ్చాడండి. ఫ్రెండ్ recieve చేసుకున్నాడు లార్జ్ లో ఉంచాడు. నెక్స్ట్ ఒక రూమ్ కి తీసుకెళ్లాడు రూమ్ చాల బాగుంది పెద్ద అపార్ట్మెంట్స్ అన్నమాట నాని అవి చూడగానే సంతోషం వచింది life set అనుకున్నాడు.


  నాని వచ్చిన వీసా 2months  ఉంది. వరం అయినది, చుట్టూ పక్కల లొకేషన్స్ చూసుకుంటూ స్విమ్మింగ్ పూల్ లో స్నానం చేస్కుంటూ ఎంజాయ్ చేస్తున్నాడు నాని. 10 రోజులు అయింది. ఫ్రెండ్ ని అడిగాడు ఏమైంది జాబ్ లో ఎప్పుడు జాయిన్ అవ్వాలి అని. ఫ్రెండ్ చెప్పాడు ఇంకా ని వీసా కంప్లీట్ అవ్వలేదు, అవ్వగానే జాయిన్ అయ్యేవు అని. 2 months  ఐపోంది వీసా రాలేదు అక్కడ వీసా చూపించే వాడు చచ్చినోడి ఫ్రెండ్. సారీ విషయం చెప్పలేదు కదా! వాడు ఏజెంట్ హాస్పిటల్ లో చని పోయాడు. వాడి ఫ్రెండ్ నానికి వీసా proceess చేస్తున్నాడు. కానీ విషయం ఏంటంటే వాడు కూడా froud నే. వాడు మనీ తినేసాడు. ఏం చెయ్యట్లేదు కానీ చేస్తున్న అని రోజులు గడిపేస్తున్నాడు.


 

నాని కి ఏం చెయ్యాలో అర్ధం కాకా ఒకడు చెప్పిన జాబ్ లో చేరాడు వీసా లేకుండా, కానీ మనీ జాయిన్ చేసినోడికి వస్తాయి వాడు నాని కి ఇవ్వాలి. కానీ వాడు శాలరీ నాని కి సరిగ్గా ఇచ్చేవాడు కాదు. రాలేదు అని చెప్పేవాడు. నాని జాబ్ మానేసాడు 3months చేసి మనీ కూడా రాలేదు. పరిస్థితి ఇంట్లో చెప్పలేడు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి ఫ్రెండ్ ని అడిగితె labour పనులకు పొమ్మని వాడు. అవి నాని వల్ల కావు పైగా వీసా లేకుండా దొంగలా పని చెయ్యాలి, వద్దనుకున్నాడు. అలా 8 నెలలు గడిచిపోయాయి. ఇక ఇంటికి బయలుదేరడం ఒక్కటే దారి. కానీ దానికి ఇబ్బందే ఎందుకంటే వీసా లేదు ఇల్లీగల్ అయ్యాడు. మల్లి మనీ కట్టాలి లేదా జైలు కి వెళ్ళాలి. అవి రెండు ఇష్టం లేదు కానీ ఎలాగైనా వెళ్లాలని ఒకడికి కొన్ని మనీ కట్టి ట్రై చేసాడు కానీ వాడు కూడా మోసం చేసాడు. మరి ఎలా అని బాధపడుతుంటే మల్లి నాని ఫ్రెండ్ ఎవరైతే తీస్కెళ్ళాడో అక్కడికి వాడే పంపిస్తాను అని కష్టపడి ఎలాగోల ఇండియా పంపించాడు. ఈ విదంగా కష్టాలు పడి మోసపోయి  ఇంటికి వచ్చాడు నాని. అప్పటికే అతనికి 7years  పోయింది ఇక అలంటి నిర్ణయం తీసుకోకూడదు అని అనుకున్నాడు నాని.

అమ్మయ్య ఇప్పటికైనా బయటపడ్డాడు అనుకుంటున్నారా... ఇంకా ఉంది.

         ఇంటికి వచ్చిన నాని వాడి ఫ్రెండ్ అని ఇంకొకడిని ఒక రోజు ఇంటికి తెచ్చాడు. అప్పటికి వాళ్ళ అమ్మ అంటుంది మల్లి ఏ దరిద్రం తెచ్చావ్ రా అని. లేదు మంచోడే వాడూ రెండు రోజులు ఇక్కడ ఉంది పోతాడు అని అమ్మ నాన్న ను ఒప్పించాడు. ఇగ వాళ్ళ అమ్మ నాన్న ఏమనలేకపోయారు. రెండు రోజులు ఉండి ఆ ఫ్రెండ్ పెళ్లిపోయాడు. ఓకే ఇప్పుడు సమస్య ఏంటంటే అప్పులు ఎలా తీరాలి. ఇంత గ్యాప్ తరువాత జాబ్ ఎక్కడ దొరుకుతది అని ఇబ్బంది లో పడ్డాడు నాని. అదే టైం లో ఒకరోజు ఈ ఇంటికొచ్చిన ఫ్రెండ్ కాల్ చేశాడు. అన్న ఒక జాబ్ ఉంది కాంట్రాక్టు లో చెయ్యాలి తరువాత పర్మనెంట్ అవుతాది అని చెప్పాడు. నాని అవసరం లేదు అన్నాడు. కానీ ఎందుకో చెప్పాలి అనిపించి ఈ విషయం వాళ్ళ అమ్మ నాన్న కి చెప్పాడు. వాళ్ళు ముందు వద్దు ఇప్పటికే మోసపోయాం ఇప్పుడు నువ్వు కూడా మోసం చేస్తే తట్టుకునే ఓపిక లేదు అని ఆ ఫ్రెండ్ తో అన్నారు వాళ్ళు కూడ. కానీ మల్లి మల్లి వాడు కాల్ చేసి వాళ్ళని, నాని ని ఒప్పించాడు.

         ఏంటి ఈ నాని గాడికి ఇంకా బుద్ధి రాలేదు అనుకుంటున్నారా... మోసపోయేటోళ్లు ఉన్నంత కాలం అంటే అమాయకులు ఉన్నంత కాలం ఏడవలు మోసం చేస్తూనే ఉంటారు. ఇంకా చెప్పేది ఏముంది మీకు అర్ధమయ్యే ఉంటది ఏం జరిగిందో. వాడు ఒక ఆఫీసర్ పేరు చెప్పి వాడు వీడు డ్రామా చేసి నాని ని మోసం చేసారు. ఈ సారి తెలిసి తెలిసి తప్పు చేసారు ఈ ఫామిలీ. నాని ఇప్పటికైనా బుడ్డిగ పని చేసుకుంటే సరిపొయ్యెది. ఇప్పుడు వాడు మనీ ఇవ్వటం లేదు. పైగా బెదిరిస్తున్నాడు. 2 సంవత్సరాలు ఐపోయింది. ఇప్పుడు వాళ్ళు 10లక్షల అప్పుల్లో ఉన్నారు. నాని కి వాళ్ళ నాన్న రాజన్న కి ఊపిరి ఆడని పరిస్థితి. ఇప్పుడు నానికి వచ్చిన పని చేసుకుంటున్నాడు నెమ్మదిగా మరియు పక్కన వాడిని కూడా నమ్మని పరిస్థితి లో ఉన్నాడు. నమ్మినా ఒక్క రూపాయి కూడా ఇచ్చే పరిస్థితి లేదు. ఇప్పటికైనా నాని మారి ఒకే ఆలోచన తో పని చేస్తాడో చూడాలి. ఇది ఒక "AIM లేని ఏమీ లేని ఒక వ్యక్తి కథ".

కథ లో మనం తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటో మీకు అర్థమైందా?

అవి ఏంటో ఒకసారి చూద్దాం.

1. మనం చదువుకున్న చదువుకోకపోయిన మనకు ఒకే పని మీద ఆలోచన ఉండాలి. అంటే మనకంటూ ఒక పని మీద శ్రద్ధ ఉండాలి. దానికోసమే పని చెయ్యాలి, చదవాలి, కష్టపడాలి మరియు ముక్యంగా దానిని మధ్యలో వదిలిపెట్ట కూడదు. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి పనికి లైఫ్ ఉంటది. అది ఏదైనా ఒకసారి ఫెయిల్ అవ్వొచ్చు, కానీ ఒకరోజు దానికి సమయం వస్తది వెయిట్ చెయ్యాలి.

 పైన చెప్పినది కరెక్ట్ గా ఉంటె ఇప్పుడు చెప్పే విషయాలతో పని లేదు. కరెక్ట్ గా లేకపోతె దానికి కారణాలు ఇవే అవుతాయి. పైన నాని జీవితం లో ఎలాంటి పరిస్థితులు వచ్చాయో చదివారుకదా అవ్వే వస్తాయి.

2. మనకు క్లారిటీ లేదు అన్నపుడు పక్కన వాళ్ళ పైన ఆధారపడతాం. మన చుట్టూ మంచివాళ్ళ కన్నా స్వార్థపరులు ఎక్కువగా ఉంటారు. మనం వాళ్ళ మీద ఆధారపడగానే వాళ్ళు దాన్ని వాళ్ళ అవసరంగా మార్చుకుంటారు.

 మనం ఒక విషయం అర్ధం చేసుకోవట్లేదు అదేంటంటే, మన చుట్టూ ఉన్న 10 మంది కి 10 రకాల ఆలోచనలు ఉంటాయి, అవన్నీ మనం వినగానే మనకు అన్ని బాగానే ఉన్నాయ్ అనిపిస్తది కానీ, మనకి ఏది కరెక్ట్ అనే విషయం మనం గ్రహించం అప్పుడే మనం మోసపోతం తరువాత బదబాదపడతాం, తల్లి తండ్రిని బాధపెడతాం. అందుకే ని నిర్ణయం నువ్వే తీస్కో, తిరుకున్న నిర్ణయంలో ఏమైనా సందేహాలు ఉంటె దాని గురించి ప్రావిణ్యం ఉన్న వాణ్ని అడిగి తెలుసుకో అంతె కానీ అంత వాడికే వదిలెయ్యకు.

 

3. ని స్థోమత ఉన్నంతవరకు ఖర్చుపెట్టు, అది కూడా నువ్వు సంపాదిస్తేనే. అంతేకాని ని స్వార్ధానికి మీ అమ్మ నాన్న ని అప్పులపాలు చెయ్యకు, బలి చెయ్యకు. వాళ్లు కాదనరు ని కోసం ఏదైనా చేస్తారు. కానీ నువ్వు వాటితో ఇంకొకడిని బతికిస్తే అప్పులతో విల్లు చస్తారు. కాబట్టి అప్పులు చేయించి తప్పులు చెయ్యొద్దు. ప్రపంచం లో నువ్వు ఎన్ని తప్పులు చేసిన నిన్ను భరించే దేవుళ్ళు అమ్మ నాన్న మాత్రమే. 

 

4. మనకి తెలియని విషయం ఏంటంటే "మనం స్నేహం చేసేవాళ్ల క్యారెక్టర్ ని బట్టి మన క్యారక్టర్ ని అంచనా వేస్తారు" చూసేవాళ్ళు. కాబట్టి మనం ఎవ్వరితో స్నేహం చేస్తున్నాం మంచివాళ్లతోనా, చెడ్డవాళ్లతోనా అనే విషయాన్నీ గుర్తించాలి. అది ఎలా బయ్యా అంటారా? నిజంగా మన స్నేహం కోరేవాడు మంచి కోరేవాడు మన దగ్గర ఒక్క రూపాయి కుడా ఆశించడు. నువ్వు కష్టాల్లో ఉన్నపుడు వెనుకడుగు వెయ్యడు. అంతకు మించి ని మీద ఇష్టాన్ని బైటకి తెలియనివ్వడు. నువ్వు తప్పు చెయ్యడానికి పొతే అడ్డుపడి ఆపుతాడు. కానీ మన కర్మ ఏంటంటే వాణ్ణే తప్పంటామ్ మనం. ఇగ చెడ్డవాడు ఎంతసేపు ని పక్కనే ఉంటూ నిన్ను పొగుడుతూ నీకేదో చేస్తున్నాను, చెయ్యాలి, నీకోసమే చెయ్యాలి అన్నట్టుగా నిన్ను మెప్పించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సమయం దొరికినపుడు ముంచేస్తాడు. అప్పుడు తెలిసొస్తది మనకి ఎవడు మంచోడు అని. అందుకే మంచివాడు ఒక్కడుచాలు. ఉంటాడు ప్రతివాడి లైఫ్ లొ ఒకడు, కానీ వాణ్ని మనం పక్కన పెడతాం.

చివరగా నేను చెప్పేది ఏంటంటే మంచోల్లో చెడ్డోల్లో నేను అనుకునేది ఒక్కటే ప్రపంచం లో అందరు స్వార్థపరులే. అందుకనే సొంతంగా బ్రకదమ్ నేర్చుకోండి, ఎవ్వరిని నమ్మకండి ముక్యంగా మనీ విషయం లో ఎవ్వరిని నమ్మకండి, మనీ ఎవ్వరికీ ఇవ్వకండి అదే విదంగా అప్పులు చెయ్యకండి. ఎంతోమంది గొప్పవాళ్ళు చెప్పారు మనీ కి విలువ ఇవ్వాలి, కాపాడుకోవాలి, పొతే మల్లి అంత ఈజీ గా దొరకదు. ప్రస్తుతం మనం ఎంత ప్రశాంతంగా ఉన్నాము అనేది ముఖ్యం, భవిష్యత్తు భగవంతునికి యెఱుక. నా ఉద్దేశం ప్రకారం ప్రతి మనిషి జీవితం మరుక్షణం మాత్రమే. క్షణం తరువాత ఎం జరుగుతదో తెలియదు. కాబట్టి ప్రశాంతంగా బ్రతకడానికి ప్రయత్నించండి.

ఇంత చెప్పావు కదా భయ్యా. . .! నీకింత అనుభవం ఎక్కడిది అంటారా.... ? మీరు విన్న కథ లో "నాని" అనె పాత్ర నాదే..... దౌర్భాగ్యుణ్ణి  నేనే.... నేనే ...

చెడ్దవాళ్ళైనా .. , చెడిపొయ్యేవాల్లైనా.. ఇకనైనా మారండి. స్నేహం పేరుతో మోసం చెయ్యకండి, మోసపోకండి.

అమ్మ నాన్న ను గౌరవించండి. డబ్బును గౌరవించండి.

మాతృదేవోభవ...  పితృదేవోభవ... జైహింద్.

        

Comments

Popular posts from this blog

గరుడ పక్షి లాగా ఆలోచించగలరా?

చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?

System లో డౌన్లోడ్ చేసిన videos అండ్ images ని మెమరీ లోకి పంపలేకపోతున్నారా? ఐతే Google Drive లోకి పంపండి ఇలా.