చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?
చెడ్డ అలవాట్లను ఎలా మానాలి అనుకుంటున్నారా?
AWAKEN THE GIANT WITHIN. ఇది ఒక బుక్ పేరు, ఇది రాసినది TONY ROBBINS ఆయన పూర్తి పేరు ANTONY JAY ROBBINS. ఆయన ఒక మోటివేషనల్ స్పీకర్.
ఈ పుస్తకం ద్వారా మన జీవితం లో ముఖ్యమైన నిర్ణయాలను మన నమ్మకాల ద్వారా పాజిటివ్ మార్పులు ఎలా తీసుకురావాలి. మనం అనుకున్న మార్గంలో ఎలా ప్రయాణించాలి. మన నిర్ణయాల మీద ఎలా నిలబడాలి. మనం అనుకున్న పనులని ఎలా సాదించాలి. మనకి ఎదురైయ్యే సమస్యలను ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాలు నేర్చుకోవచ్చు. కొన్ని విషయాలు ఇప్పుడు చూద్దాం.
1. మన జీవితం లో మనం తీసుకున్న నిర్ణయాలకు మనం ఖచ్చితంగా కట్టుబడి ఉండాలి.
ఒకసారి ఆలోచించండి మన జీవితంలో మార్పు రావాలి అని చివరిసారిగా ఎప్పుడు అనుకోని ఉంటాం? బహుశా న్యూ ఇయర్ రోజు అనుకుంట, ఈ రోజు నుండి నేను అన్ని మానేస్తాను మంచి పనులే చేస్తాను అని, డ్రింకింగ్, స్మోకింగ్ చెయ్యను అని అండ్ బరువు తగ్గుతానని ఎన్నో అనుకుంటాం కదా? కానీ అనుకున్నవన్నీ ఫాలో అవుతున్నామా మరి?
రైటర్ ఏమంటారు అంటే, ఎవరైతే ఫాలో ఎవ్వరో వాళ్లలో ఉండే మెయిన్ ప్రాబ్లెమ్ వాళ్ళ ఆలోచనలే. ఆ ఆలోచనల్లో చిన్న మార్పు చేసుకుంటే అన్ని పనులు అనుకున్నట్టు అవుతాయి. నేను జంక్ ఫుడ్ మానేస్తాను దానికి బదులు మంచి ఫుడ్ తినడం మొదలు పెడతాను అని అనుకోవడం చాల మంచిది అని అంటారాయన.
మన జీవితం లో ఏదైనా మార్పు రావాలి అంటే మనం ముందుగా ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలి తీసుకున్న నిర్ణయానికి ఎన్ని అడ్డంకులు వచ్చిన వదలకూడదు. తీసుకున్న నిర్ణయం మీద క్లారిటీ ఉంటె ఎన్ని ఇబ్బందులు వచ్చిన దానికి ఎదురుగా నిలబడే శక్తి మనకి ఉంటది.
అనుకున్న నిర్ణయాల మీద నిలబడడం, కట్టుబడి ఉండడం కష్టమైన పనే కానీ, దానిని మనం ఎంత ఎక్కువ పాటిస్తే అది అంత ఈజీ అవుతుంది.
ఎప్పుడైన మనం అనుకున్న మార్పులు తీసుకురాకపొతే నిరాశపడకూడదు. ఎక్కడ తప్పు చేసామో అలోచించి సరిచేసుకొని మల్లి ఆ తప్పు జరగకుండా చూడాలి.
మనం చాల సార్లు చెడ్డ పనులు మానేద్దాం అన్న మనలేకపోతున్నాం అంటే అవి ఎప్పుడు ఎలాంటి సందర్భాల్లో చెయ్యాలి అనిపిస్తూనుంధో ఆలోచించాలి అలంటి సందర్భాలకు కష్టమైన దూరంగా ఉండండి. ఇలా చేస్తే మనం సగం మానేసినట్టే.
ఇక రెండవది చూద్దాం.
2. మనం మానాలి అనుకుంటున్నా అలవాట్లను ఇష్టం లేని అలవాట్లతో జత చెయ్యండి.
మనం యెంత ప్రయత్నించినా మన అలవాట్లు మానడం లేదు. ఐతే మనం అవి ఎందుకు చేస్తున్నాం. తాత్కాలిక మానసిక ఆనందం కోసం లేదా, బాధలను తాత్కాలికంగా మర్చిపోవడానికి కదా. ఐతే ఇదే విషయాన్నీ అడ్వాంటేజ్ గా వాడుకోండి. మనం మానాలి అనుకుంటున్నా అలవాట్లను మనకి నచ్చని అంటే ఇష్టం లేని అలవాట్లతో జత చెయ్యండి. అప్పుడు కచ్చితంగా చెడుపని చెయ్యాలి అంటే ఇష్టం లేని పని కూడా చెయ్యాల్సి వస్తది. కొంత కాలం అది కూడా కానీ ఒకరోజు అది విరక్తి వస్తది మానేస్తారు. కానీ ఇక్కడ మీరు నిర్ణయాన్ని కచ్చితంగా పాటించాలి. చాకోలెట్ తినడం మానెయ్యాలి అని ఉంది ఐతే అది తినేటప్పుడు మీకు నచ్చని పాట ఏదైనా పడాలి అని నిర్ణయించుకోండి. అప్పుడు మీకు నచ్చిన చాక్లెట్ తినాలి అంటే నచ్చని పాట పాడాలి . అది పాడితే అందరిలో పరువుపోతాది కాబట్టి చాక్లెట్ తినరు. ఇలా ప్రతి పనికి ఒక నచ్చని పనిని జత చెయ్యాలి పాటించాలి. ఇలా చేసి చాల మంది వాళ చెడ్డ అలవాట్లు మానేశారు అని రైటర్ ఈ బుక్లో చెప్పారు. ఇక మూడవది చూద్దాం.
3. పాత చెడ్డ అలవాట్ల స్తానం లో కొత్త మంచి అలవాట్లు అలవర్చుకోవడం.
మనకున్న చెడ్డ అలవాటు మానాలి అంటే దానికి బదులుగా కొత్త మంచి అలవాటేదైనా చేర్చుకోవాలి చెయ్యాలి. ఉదాహరణకి మనకి ఫాస్ట్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్ ఐన జంక్ ఫుడ్ తినాలి అనిపిస్తే, దానికి బదులు ఆరోగ్యానికి మంచివైనా పండ్లు కొనుక్కొని తినాలి. ఆలా తినడం వలన కొంత కాలానికి అలవాటైపోతుంది. ఇంకా మనకి స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ చెయ్యాలి అని అనిపిస్తే లేదా ఎవరైన పిలిస్తే బిజీగా పని ఏదైనా పెట్టుకోవాలి. మనం జంక్ ఫుడ్ తింటే లావుగా అవటం వలన మనకి ఇష్టమైన బట్టలు అంటే జీన్స్ ట్-షర్ట్స్ వేస్కోలేము అని ఆలోచన మన మైండ్లోకి ఎక్కించాలి. అప్పుడు మీరు హెల్త్య్ ఫుడ్ మాత్రమే తింటారు.
చాల రీసెర్చ్ లలో తేలిన విషయం ఏంటంటే చాలా మంది డ్రోగ్ ఎడిక్షన్ ఉన్నవాళ్ళని డాక్టర్లు ఇలానే ట్రీట్ చేస్తారట. వాళ్ళ చెడ్డ అలవాట్లకు బదులుగు వాళ్ళకి కొత్త అలవాట్లు పరిచయం చేస్తారట. వాళ్ళ మధ్య కొత్త రిలేషన్స్ క్రీట్ చేస్తారట. ఆ అలవాట్లు మల్లి గుర్తుకు రాకుండా చేస్తారట. ఇలా చెయ్యడం వాళ్ళ ఎంతోమంది మారారు అని డాక్టర్లు చెప్తున్నారు.
ఈ కంటెంట్ లో నేను చెప్పేది ఏంటంటే, కొంచం కష్టమైనా చెడ్డ అలవాట్లను మంచి అలవాట్లతో రీప్లేస్ చెయ్యడం వలన మన జీవితంలో మార్పు తీసుకు రావచ్చు.
ఇంకెందుకు ఆలస్యం మీలోని చెడ్డ అలవాట్లను మంచి అలవాట్లతో మర్చి మీ జీవితంలో మంచి మార్పులు తెచ్చుకోండి, సంతోషంగా ఉండండి.
నేను చెప్పిన కాదు కాదు రైటర్ రొబ్బిన్స్ చెప్పిన ఈ మాటలు మీకు నచ్చితే నలుగురికి పంపండి వాలు పాటిస్తారేమో చూద్దాం. ఏమంటారు? ఉంటాను మరి.........😊
Comments
Post a Comment